Advertisement
Google Ads BL

అజిత్‌ ఆవేశం ను తట్టుకోగలరా..!


తమిళస్టార్‌ హీరో అజిత్‌ ప్రస్తుతం శివ డైరెక్షన్‌లో వేదలమ్‌ అనే చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో అజిత్‌ సరసన శృతిహాసన్‌ నటిస్తోంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ఈనెల 10వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈచిత్రాన్ని అదేరోజు తెలుగులో కూడా ఒకేసారి విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి తెలుగులో ఆవేశం అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీకి యువ సంగీత దర్శకుడు అనిరుద్‌ సంగీతం అందిస్తున్నాడు. అజిత్‌ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందించడం ఇదే తొలిసారి కావడం, ఇందులోని పాటలన్నీ బాగా హిట్‌ కావడంతో ఈ చిత్రం మ్యూజికల్‌గా కూడా పెద్ద హిట్‌ అవుతుందని చెన్నై సినీ వర్గాలు అంటున్నాయి. ఎ.ఎం. రత్నం నిర్మాణ సారధ్యంలో అజిత్‌ నటిస్తున్న 56వ చిత్రంగా వస్తున్న ఈ చిత్రం రైట్స్‌ కోసం బయ్యర్లు విపరీతంగా పోటీపడుతున్నారు. మరి ఈ చిత్రం తమిళ, తెలుగు ప్రేక్షకులను ఏమాత్రం అలరిస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs