మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి పనిచేయాలని ప్రతి ఒక్క స్టార్ హీరో కలలు కంటారు. కాగా ప్రస్తుతం ఆయన నితిన్ హీరోగా అ..ఆ అనే చిత్రం చేస్తున్నాడు. ఎందరో స్టార్స్‌కు రాని అవకాశం నితిన్‌కు ఈజీగా దొరకడంతో అతను ఎంతో అదృష్టవంతుడని మిగిలిన హీరోలు భావిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రం తర్వాత మహేష్‌బాబుతో ఓ చిత్రం చేయాలని అనుకుంటున్నాడు. మహేష్‌బాబు తదుపరి చిత్రం తమకే చేయాలని త్రివిక్రమ్‌పై ఇద్దరు స్టార్స్ బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నారు. బాహుబలి2 తర్వాత ఓ సాఫ్ట్ అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు. అందుకోసం సుజీత్‌ను కొంతకాలం ఆగమని చెప్పాలని, త్రివిక్రమ్ ఒప్పుకుంటే సుజీత్‌ను పక్కనపెట్టి మరీ త్రివిక్రమ్‌తో సినిమా చేయాలని ప్రభాస్ భావిస్తున్నాడు. మరోవైపు సన్నాఫ్ సత్యమూర్తి తో రామ్‌చరణ్‌కు త్రివిక్రమ్‌తో చేసే అవకాశం లభించింది. పవన్‌కళ్యాణ్ తానే నిర్మాతగా రామ్‌చరణ్ హీరోగా నిర్మించే చిత్రానికి త్రివిక్రమ్‌నే డైరెక్ట్ చేయమని ఒత్తిడి చేస్తున్నాడట. మరి ఈ ఇద్దరిలో ఎవరితో ముందుగా త్రివిక్రమ్ సినిమా చేస్తాడో వేచిచూడాల్సివుంది...!