Advertisement
Google Ads BL

రామ్‌చరణ్‌ సినిమా చేతులు మారిందా?


త్వరలో రామ్‌చరణ్‌ హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తమిళ సూపర్‌హిట్‌ మూవీ తని ఒరువన్‌ చిత్రంను రీమేక్‌ చేయనున్న సంగతి తెలిసిందే. కాగా మొదట్లో ఈ చిత్రాన్ని ఎన్వీప్రసాద్‌తో కలిసి డి.వి.వి.దానయ్య నిర్మించనున్నట్లు ప్రచారం జరిగింది. కానీ దానయ్య ఇటీవలే రామ్‌చరణ్‌తో తీసిన బ్రూస్‌లీ చిత్రం డిజాస్టర్‌గా నిలవడంతో ఆయన ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాడని, అందువల్ల తని ఒరువన్‌ రీమేక్‌ నిర్మాణ బాధ్యతల నుండి ఆయన తప్పుకున్నట్లు సమాచారం. ఆ స్ధానంలోకి గీతాఆర్ట్స్‌ అధినేత అల్లుఅరవింద్‌ ఎంటర్‌ అయ్యాడట. ఇదే నిజమైతే ఎన్వీప్రసాద్‌, అల్లుఅరవింద్‌ల సంయుక్త భాగస్వామ్యంతో ఈ చిత్రం తెరకెక్కనుంది. మరి దానయ్య తన ఆర్థిక ఇబ్బందుల నుండి ఎప్పుడు బయటపడుతాడో వేచిచూడాల్సివుంది. ఈ వార్తను విన్నవారు అయ్యో..పాపం దానయ్య అంటున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs