Advertisement
Google Ads BL

తమన్నా మరో ఐటెం కి రెడీ!


హీరోయిన్‌గా మంచి ఫామ్‌లో ఉన్న తమన్నా ఆ మధ్య వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన అల్లుడు శీను చిత్రంలో ఓ ఐటమ్‌సాంగ్‌ చేసింది. ఆ పాట ఆ సినిమాకు మంచి ప్లస్‌ అయింది. అయితే ఆ తర్వాత మరలా తమన్నా మరో ఐటం సాంగ్‌ చేయలేదు. కానీ తాజాగా ఆమె మరోసారి స్పెషల్‌సాంగ్‌ చేయడానికి ఒప్పుకొందిట. అది కూడా మరలా బెల్లంకొండ శ్రీనివాస్‌ సినిమానే కావడం విశేషం. ప్రస్తుతం బెల్లంకొండ శ్రీనివాస్‌ భీమనేని శ్రీనివాసరావు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించిన సుందరపాండ్యన్‌ కు రీమేక్‌. ఇందులో ఓ స్పెషల్‌సాంగ్‌కు స్థానం ఉంది. ఈ పాట కోసం తమన్నాను సంప్రదించగా అందుకు ఆమె గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిందని, ఇందుకోసం భారీ మొత్తం రెమ్యూనరేషన్‌ను డిమాండ్‌ చేసిందని సమాచారం. సో... ఈ సినిమాలో మిల్కీబ్యూటీ తమన్నా మరోసారి రెచ్చిపోనుంది. ఈ చిత్రానికి స్పీడున్నోడు అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs