Advertisement
Google Ads BL

హరికృష్ణ స్థానంలో మోహన్‌లాల్‌..!


కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్‌ హీరోగా మైత్రిమూవీ మేకర్స్‌ బేనర్‌లో త్వరలో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. జనతాగ్యారేజ్‌ అనే టైటిల్‌తో ఇక్కడ అన్ని రిపేర్లు చేయబడును అనే శీర్షికను ఖరారు చేసినట్లు సమాచారం. కాగా తన మొదటి సినిమా మిర్చి ద్వారా సత్యరాజ్‌, నదియాలకు బ్రేక్‌ ఇచ్చిన కొరటాలశివ ఎన్టీఆర్‌తో చేస్తున్న చిత్రంలో ఓ అగ్రహీరో చేయాల్సిన ఓ గెస్ట్‌రోల్‌ కీలకంగా ఉంటుందని తెలియజేసిన సంగతి తెలిసిందే. కాగా ఆ పాత్రకు మొదట ఎన్టీఆర్‌ తండ్రి హరికృష్ణను అనుకొన్నప్పటికీ ఆయన తన అనారోగ్యం దృష్ట్యా దానికి ఒప్పుకోలేదు. దాంతో సెకండ్‌ ఆప్షన్‌గా మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ను ఆ పాత్ర కోసం సంప్రదిస్తున్నట్లు సమాచారం. మరి మోహన్‌లాల్‌ కనుక ఓకే చెబితే, బిజినెస్‌పరంగా కూడా ఈ చిత్రానికి భారీ క్రేజ్‌రావడం ఖాయమంటున్నారు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs