Advertisement
Google Ads BL

యేలేటి డైరెక్షన్‌లో శివరాజ్‌కుమార్‌..!


ఇటీవలే విభిన్న చిత్రాల దర్శకుడు చంద్రశేఖర్‌ యేలేటి ఓ భారీ మల్టీ లింగ్వల్‌ ఫిల్మ్‌ని తీయనున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మోహన్‌లాల్‌, గౌతమిలు జంటగా నటించనున్నారు. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఏకకాలంలో రూపొందనుంది. కాగా ఈసినిమాకు కన్నడ వెర్షన్‌ను కూడా తీయాలని చంద్రశేఖర్‌ యేలేటి ప్లాన్‌ చేస్తున్నాడు. కన్నడ వెర్షన్‌కు హీరోగా శివరాజ్‌కుమార్‌ను తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు చంద్రశేఖర్‌ యేలేటి శివన్నతో చర్చలు కూడా జరిపినట్లు సమాచారం. ప్రస్తుతం శివన్నతో రామ్‌గోపాల్‌ వర్మ కిల్లర్‌ వీరప్పన్ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఇప్పటికే కన్నడలో భారీ క్రేజ్‌ వచ్చింది. సో... తెలుగు దర్శకులు తెరకెక్కిస్తున్న రెండు విభిన్న చిత్రాల్లో శివరాజ్‌కుమార్‌కు చోటు దక్కింది. మరి ఇవి ఏ స్థాయిలో కన్నడ ప్రేక్షకులను ఆలరిస్తాయో వేచిచూడాల్సివుంది...! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs