ఇటీవల వచ్చిన కంచె చిత్రంలో తన నటనతో రెండో చిత్రంతోనే విమర్శకుల ప్రశంసలు పొందిన మెగాహీరో వరుణ్‌తేజ్. కంచె చిత్రాన్ని అన్నివైపుల నుండి మంచి మార్కులే పడుతున్నాయి. దీంతో వరుణ్‌తేజ్ తాజా చిత్రంపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. ఆయన పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్నటివరకు లోఫర్ అనే పేరుతో ప్రచారం జరిగిన ఈ చిత్రానికి మా అమ్మ మహాలక్ష్మీ అనే టైటిల్‌ను అనుకొంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. పోస్ట్‌ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సి.కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. కాగా ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న విడుదల చేయాలని దర్శకనిర్మాతలు భావిస్తూ, ఆ తేదీని లాక్ చేశారని సమాచారం. నవంబర్ చివరి వారంలో గానీ లేదా డిసెంబర్ మొదటి వారంలో గానీ ఈ చిత్రం ఆడియో విడుదల అవుతుంది. మరి ఈ చిత్రంలో వరుణ్‌తేజ్ మదర్ సెంటిమెంట్‌ను అద్భుతంగా పోషించినట్లు సమాచారం. ఇందులో వరుణ్‌తేజ్‌కు అమ్మగా రేవతి నటిస్తున్న సంగతి తెలిసిందే.