ఓ సినిమాకు హిట్ టాక్ వస్తే ఆ కథే వేరు. ఆ దర్శకుడికీ, టీమ్‌కు వరస ఆఫర్స్ వస్తుంటాయి. ఇప్పుడు అలాంటిదే దర్శకుడు ఓంకార్‌కు జరుగుతోందని ఫిల్మ్‌నగర్ టాక్. జీనియస్ చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకొని తన మొదటి ప్రయత్నానికి భిన్నంగా రాజు గారి గది అంటూ హర్రర్ కామెడీతో మన ముందుకు వచ్చాడు. దసరా కానుకగా అక్టోబర్ 22న విడుదలైన ఈ చిత్రానికి మంచి టాక్ వచ్చింది. దీంతో ఓ పెద్ద ప్రొఢక్షన్ హౌస్ నుంచి ఓంకార్‌కు ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత.. ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేసిన అనిల్‌సుంకర ఈ దర్శకునితో తన ఎకె ఎంట్‌టైన్‌మెంట్స్‌బేనర్‌లో మీడియం బడ్జెట్‌లో ఓ చిత్రం చేయమని ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఓంకార్ అన్నయ్య ఆనందంతో మునిగితేలుతున్నాడట...!