ప్రభాస్.. ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌కేక్. బాహుబలి చిత్రంతో బాలీవుడ్‌లో కూడా ప్రభాస్‌కు మంచి గిరాకి ఏర్పడింది. ప్రస్తుతం బాహుబలి-2 కు సిద్ధమవుతున్న ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ పెళ్లి వార్త ఒక్కటి ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో హల్‌చల్ చేస్తుంది. తన తోటి హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుని.. తండ్రిగా పుత్రవాత్సల్యాన్ని అనుభవిస్తున్నారు. అయితే ఇదే ఆలోచన కూడా ప్రభాస్‌లో వచ్చిందే పనిగా పెళ్లి చేసుకోవాలని ఫిక్సయ్యాడట. 2016లో ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో.. అమ్మాయి ఎవరని టాలీవుడ్‌లో సందేహాలు మొదలయ్యాయి. ప్రభాస్..ఎవరితోనైనా లవ్‌లో వున్నాడా? లేక పెద్దలు కుదిర్చిన సంబంధాన్ని సినిమా పరిశ్రమకు సంబంధం లేని అమ్మాయిని చేసుకుంటాడా? అనే చర్చలు మొదలయ్యాయి. అయితే ప్రభాస్‌తో మూడుకుపైగా సినిమాల్లో నటించి హీరోయిన్‌గా తనకంటూ ఓ గుర్తింపును సంపాందించుకున్న ఓ స్టార్‌హీరోయిన్‌తోనే ప్రభాస్ పెళ్లి జరగబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తను ఆయన బంధువులు, సన్నిహితులు ఖండిస్తున్నారు. అయితే నిప్పు లేనిదే పొగరాదు కదా అనే సామెత ప్రకారం ఆలోచిస్తే మాత్రం కాస్త అందరికి ఈ వార్తపై ఆసక్తి కలగకమానదు.