Advertisement
Google Ads BL

అందర్నీ కన్‌ఫ్యూజ్‌ చేస్తున్న రాజమౌళి.!


ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన బాహుబలి సంచలనాలు అందరికీ తెలిసిందే. బాహుబలి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, మా టివిలో ఈ చిత్రం టెలికాస్ట్‌ అవుతున్న సందర్భంగా రాజమౌళి, విజయేంద్రప్రసాద్‌లను ఇంటర్వ్యూ చేసింది ఓ టి.వి. ఛానల్‌. బాహుబలి 3 వుంటుందా అని యాంకర్‌ అడిగిన ప్రశ్నకు అవునని సమాధానం చెప్పాడు రాజమౌళి. బాహుబలి 3 తప్పనిసరిగా వుంటుందని, ఆ వివరాలు ఇప్పుడే చెప్పలేనని అన్నాడు. విజయేంద్రప్రసాద్‌ కూడా ఈ విషయాన్ని కన్‌ఫర్మ్‌ చేస్తూ బాహుబలి 3 చేసే ఆలోచన మాకు వుందని చెప్పాడు. 

Advertisement
CJ Advs

ఇదిలా వుంటే రాజమౌళి తన ట్విట్టర్‌లో మాత్రం బాహుబలి 3 గురించి వచ్చే రూమర్స్‌ని నమ్మొద్దని, బాహుబలి2తోనే కథ ఎండ్‌ అయిపోయిందని చెప్తున్నాడు. ఈ విషయంలో తాను ఏం చెయ్యాలనుకుంటున్నానో తనకే తెలుసునని ట్వీట్‌ చేశాడు. బాహుబలి ప్రపంచం అనేది కొనసాగుతుందని, బాహుబలి 3 వుంటుంది. కానీ, అది దీనిలా వుండదని, అది వేరే ప్రాజెక్ట్‌ అన్నట్టుగా చెప్పుకొచ్చాడు. అంటే ప్రభాస్‌ బాహుబలి 2 వరకే పరిమితం అవుతాడా? బాహుబలి 3లో వుండడా? అనే ప్రశ్నలను ప్రేక్షకులకు వదిలేశాడు రాజమౌళి. ఓ పక్క టి.వి. ఛానల్‌లో బాహుబలి 3 చేస్తానని చెప్తూనే మరో పక్క తన ట్విట్టర్‌లో బాహుబలి 3 గురించి ఎవరికీ అర్థం కానీ ట్వీట్స్‌తో అందర్నీ కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నాడు రాజమౌళి. ఏది ఏమైనా ప్రస్తుతానికి రాజమౌళి కాన్‌సన్‌ట్రేషన్‌గానీ, ప్రేక్షకుల క్యూరియాసిటీగానీ బాహుబలి 2 మీదేనన్న విషయంలో మాత్రం ఎలాంటి కన్‌ఫ్యూజన్‌ లేదు. 

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs