రామ్‌చరణ్ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో చిరంజీవి అతిథి పాత్ర చేసిన బ్రూస్‌లీ (ది ఫైటర్) చిత్రానికి మొదటి షో నుండే నెగటివ్ టాక్ రావడంతో ఈ చిత్రాన్ని కొన్న డిస్ట్రిబ్యూటర్లు నిలువునా మునిగినట్లయిందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా ఈ చిత్రం రాబట్టలేదని, ఇక ఓవర్‌సీస్ పరిస్థితి మరీ దారుణంగా ఉందనే ప్రచారం జరుగుతోంది. దీంతో డిస్ట్రిబ్యూటర్లు రామ్‌చరణ్‌ను రికవరీ విషయమై విజ్ఞప్తి చేస్తున్నారు. రామ్‌చరణ్ తదుపరి చిత్రం తని ఒరువన్ రీమేక్‌కు కూడా నిర్మాత దానయ్య భాగస్వామి అని తెలుస్తుండటంతో.. చరణ్ తదుపరి చిత్రం హక్కులను డిస్ట్రిబ్యూటర్లు అడుగుతున్నారు. దాంతో తమ నష్టం కొంత శాతం అయినా రికవరీ అవుతుందని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఈ విషయంలో హీరో రామ్‌చరణ్, నిర్మాత డి.వి.వి. దానయ్యలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరూ ఎదురుచూస్తున్నారు.