గమ్యం,వేదం, కృష్ణం వందే జగద్గురం వంటి చిత్రాలతో తనదైన ప్రత్యేక శైలిని సొంతం చేసుకున్న దర్శకుడు క్రిష్. ప్రస్తుతం ఆయన మెగాహీరో వరుణ్‌తేజ్ హీరోగా కంచె సినిమా తీశాడు. ఈ చిత్రం 22వ తేదీన విడుదలకు సిద్దమవుతోంది. కాగా క్రిష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై పలువురికి మంచి అంచనాలు ఉన్నాయి. కాగా క్రిష్ కేవలం తెలుగుకే పరిమితం కాలేదు. హిందీలో ఆయన ఠాగూర్ చిత్రాన్ని గబ్బర్ పేరుతో తెరకెక్కించాడు. అలా ఆయన ఎవరో దేశం మొత్తానికి తెలిసింది. కాగా ఈ అవకాశం తనకు కేవలం మహేష్‌బాబు వల్లే వచ్చిందని క్రిష్ చెబుతున్నాడు. వాస్తవానికి ఆ సమయంలో క్రిష్ మహేష్‌తో శివమ్ టైటిల్‌తో ఓ చిత్రం చేయాలని ప్లాన్ చేశాడు. స్టోరీని మహేష్‌కు కూడా వినిపించాడు. కానీ ఎందువల్లో ఈ చిత్రం పట్టాలెక్కలేదు. ఈ సమయంలో బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్ సంజయ్‌లీలా భన్సాలీ నుండి ఆయనకు గబ్బర్ కోసం పిలుపు వచ్చింది. మహేష్‌బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్‌లు ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన సబీనాఖాన్‌కు క్రిష్‌ను సిఫార్సు చేశారు. అలా మహేష్, నమ్రతల వల్లనే తనకు ఈ బాలీవుడ్ చాన్స్ వచ్చిందని క్రిష్ స్వయంగా వెల్లడించాడు.