కుర్ర స్టార్ హీరోల అందరి పక్కన రొమాన్స్ చేయాలని ప్రతి హీరోయినుకి కోరిక ఉండొచ్చు గానీ సమంతా, తమన్నా, కాజల్ లాంటి ఏ కొద్ది మందికో మాత్రమే ఈ కోరిక తీరుతుంది. అందునా ప్రతి హీరోతో చాన్స్ దొరక్క పోయినా దొరికినోళ్ళని దొరికినట్టుగా వాడేస్తే ఓ రికార్డయితే మిగులుతుంది. ఇలా అందరి హీరోలను చుట్టేసిన సమంతా ఒకే ఒక్క రామ్ చరణ్ సరసన మాత్రం వాలలేకపోయింది. ఎవడు, బ్రూస్ లీ లాంటి మూవీలకి ఈవిడ పేరు ప్రతిపాదించినా సమయానికి అమ్మడు బిజీగా ఉండడంతో దొరికినట్టే దొరికి మెగా పవర్ స్టార్ మిస్సయ్యాడు.
ప్రస్తుతానికి సమంతా హవా తగ్గిన విషయాన్ని గమనిస్తే ఈ అందాల ముద్దుగుమ్మ పెద్ద చేపల కోసం పెద్ద వలలే వేస్తోంది. అలానే చిక్కింది ఇప్పుడు రామ్ చరణ్ చేయనున్న తని ఒరువన్ తెలుగు రీమేక్. దానయ్య నిర్మాతగా మొదలవనున్న ఈ చిత్రంలో చరణ్ పక్కన సమంతా ఫైనల్ అయింది అన్నది లేటెస్ట్ బజ్. మహేష్ బాబుతో బ్రహ్మోత్సవం, నితిన్ సరసన అ ఆ ప్రస్తుతానికి సమంత ఒప్పుకున్న సినిమాలు. తమిళంలో కూడా కొన్ని సినిమాలు చేతిలో ఉన్నప్పట్టికీ రామ్ చరణ్ అనేసరికి అమ్మడు గంతేసి మరీ ఒప్పేసుకుందట.