అఖిల్ చిత్రం విడుదల వాయిదాపడటంతో అక్కినేని అభిమానులు కోపంగా ఉన్నారు. ఈ సినిమాని నితిన్ కావాలనే వాయిదా వేశాడని నిందిస్తున్నారు. నితిన్‌కి వ్యతిరేకంగా కొంత మంది అక్కినేని అభిమానులు నిరసన తెలుపుతూ... రోడ్డెక్కడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. బ్రూస్‌లీ చిత్రానికి మరోవారం గ్యాప్ ఇవ్వడానికే అఖిల్ సినిమాను నితిన్ వాయిదా వేశాడన్నది అభిమానుల కోపం. అయితే అఖిల్ చిత్రాన్ని విడుదల చేయాలని నితిన్ చివరి నిమిషం వరకు తీవ్రంగా ప్రయత్నాలు చేశాడట. కానీ నాగార్జున ఖచ్చితంగా వాయిదా వేయమని చెప్పడంతో విధిలేని పరిస్థితుల్లో మాత్రమే వాయిదా పడిందని సమాచారం. ఈ చిత్రాన్ని చూసిన నాగ్ గ్రాఫిక్స్ విషయంలో తీవ్ర అభ్యంతరం తెలిపాడని తెలుస్తోంది. వినాయక్‌ని పిలిచి ఏం చేస్తూన్నావ్ అంటూ చీవాట్లు పెట్టినట్లు సమాచారం. నితిన్ మాత్రం సినిమాను ఎలాగైనా విడుదల చేయాలనే ప్రయత్నం చేస్తుంటే నాగ్ మాత్రం వారించాడట. అలాంటప్పుడు నితిన్‌ను నిందించి ఏం లాభం? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.