రామ్‌చరణ్ నటించిన బ్రూస్‌లీ నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ రావడంతో రుద్రమదేవి దర్శకుడు గుణశేఖర్ రిలాక్స్ అయ్యాడట. గతవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన రుద్రమదేవి యావరేజీ టాక్ తెచ్చుకున్న కలెక్షన్లు మాత్రం బలంగా వున్నాయి. అయితే ఇలాంటి చారిత్రక సినిమాకు కనీసం రెండు వారాల గ్యాప్ అవసరమని భావించినా గుణశేఖర్, రామ్‌చరణ్‌తో పాటు దానయ్యను కూడా కలిసి బ్రూస్‌లీ విడుదల వాయిదా వేసుకోమని విన్నవించుకున్నాడు.అయినా తమ విడుదల తేదీలో మార్పు వుండదని ఖరాఖండిగా చెప్పారట. దీంతో గుణశేఖర్ బ్రూస్‌లీ చిత్ర రిజల్ట్ కోసం టెన్షన్‌గా ఎదురుచూశాడు. ఇక ఫలితం గుణశేఖర్‌కు అనుకూలంగా రావడంతో..రుద్రమదేవి పబ్లిసిటీని మళ్ళీ మొదలుపెట్టాడు గుణశేఖర్. సో..ఇక వారం కూడా కలెక్షన్లు రుద్రమదేవి చిత్రానికే వుంటాయని అంటున్నారు ట్రేడ్‌వర్గాలు.