టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఎంత బిజీనో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా షూటింగ్‌లతో, యాడ్ ఫిల్మ్స్ షూటింగ్స్‌లో ఆయన ఎప్పుడూ బిజీగానే ఉంటారు. ఆయన ఉంటే షూటింగ్‌లోనా? లేకపోతే ఇంట్లోనా? అన్నట్లు ఉంటాడు. అంతేగానీ ఎక్కడా విడిగా కనిపించడు. ఇలా మహేష్‌బాబు ప్రొఫెషనల్ షూటింగ్‌లో బిజీగా ఉంటే ఇల్లు పిల్లలకు సంబంధించిన వ్యవహారాలన్నీ ఆయన శ్రీమతి నమ్రతాశిరోద్కర్ చూసుకుంటుంది. చాలా బిజీగా ఉండే మహేష్‌కు తనకు కావాల్సిన వస్తువులను కొనే సమయం కూడా ఉండదు. ఇక తన శ్రీమతికి షాపింగ్ చేసే సమయం కూడా ఆయనకు ఉండదని అర్థం అవుతోంది. అందుకే ఆయనకు కావాల్సిన దుస్తులు, ఇతర వస్తువులను ఆయన శ్రీమతే షాపింగ్ చేసి ఇస్తుందట. ముఖ్యంగా దుబాయ్, అమెరికాలో షాపింగ్ చేయడానికి నమ్రతా శిరోద్కర్ బాగా ఇష్టపడుతుందట...! ఈ విషయాలన్నిటినీ ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.