Advertisement
Google Ads BL

గౌతమ్‌మీనన్‌ పెద్ద స్కెచ్‌ వేస్తున్నాడు..!


సౌత్‌ ఇండియన్‌ ఫిల్మ్‌మేకర్స్‌లో గౌతమ్‌మీనన్‌కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. త్వరలో ఓ భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించే ప్లానింగ్‌లో ఆయన ఉన్నట్లు సమాచారం. సౌత్‌లో నాలుగు భాషల ఇండస్ట్రీలలో పాపులర్‌ అయిన అల్లుఅర్జున్‌, శింబు, పునీత్‌రాజ్‌కుమార్‌, పహాద్‌ ఫాజిల్‌లతో ఓ భారీ చిత్రాన్ని ఏకకాలంలో నాలుగు భాషల్లోనూ ఏకకాలంలో తీయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇలా ఒకే సారి ఓకే చిత్రాన్ని నాలుగు భాషల్లో తెరకెక్కిస్తే అది ఆర్థికంగా కూడా బాగా వర్కౌట్‌ అవుతుందని సినీ విశ్లేషకులు అంటున్నారు. మరి ఈ చిత్రానికి సంబంధించిన స్రిప్ట్‌ వర్క్‌లో గౌతమ్‌మీనన్‌ తలమునకలై ఉన్నాడు. ఇలాంటి ప్రయోగం కనుక సెట్‌ అయి మంచి విజయం సాధిస్తే... ఇలాంటి సినిమాలను మరింత మంది ఫాలో అయ్యే అవకాశం ఉందని ట్రేడ్‌వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మొత్తానికి మీనన్‌ ఓ మంచి ప్రయోగానికే తెరతీశాడని చెప్పవచ్చు. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs