Advertisement
Google Ads BL

అది మన నారా గారి సినిమానే..!


నారారోహిత్‌ హీరోగా ఆమధ్య ప్రతినిధి అనే చిత్రం వచ్చింది. విభిన్న చిత్రాలను ఆదరించే ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. కాగా ఈ చిత్రాన్ని ఇప్పుడు తమిళంలోకి రీమేక్‌ చేస్తున్నారని సమాచారం. ఈ విషయాన్ని యూనిట్‌ మొత్తం సీక్రెట్‌గా మెయిన్‌టెయిన్‌ చేసింది. చివరకు ఎలాగోలా ఈ రీమేక్‌ విషయం చెన్నై మీడియాకి తెలిసిపోయాయి. ఈచిత్రం టైటిల్‌ కో2 అని సమాచారం. తమిళ రీమేక్‌లో బాబిసింహా హీరోగా నటిస్తున్నాడు. ఇక కిడ్నాప్‌కు గురయ్యే ముఖ్యమంత్రి పాత్రలో ప్రకాష్‌రాజ్‌ నటిస్తున్నాడు. శరత్‌ మండవ దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో లోబడ్జెట్‌ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాన్ని తమిళంలో 30కోట్లతో భారీ ఎత్తున రీమేక్‌ చేస్తున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా విడుదలకానుంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs