Advertisement
Google Ads BL

బన్నీకి క్రిష్‌ లైన్‌ వేస్తున్నాడా..?


తాజాగా విడుదలైన రుద్రమదేవి చిత్రానికి అల్లుఅర్జున్‌ నటించిన గోనగన్నారెడ్డి పాత్ర అతి కీలకం. ఈ పాత్రలో బన్నీ అదరగొట్టాడు. ఇప్పుడు అందరూ బన్నీ గురించే మాట్లాడుతున్నారు. కాగా గతంలో బన్నీతో వేదం చిత్రాన్ని తీసిన దర్శకుడు క్రిష్‌ ఈ చిత్రం చూసి సాహో... గోనగన్నారెడ్డి....మనకో కొత్త రాబిన్‌హుడ్‌ పరిచయం అయ్యాడు. నీకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను... బన్నీ అదరకొట్టేశావ్‌.... అంటూ క్రిష్‌ బన్నీపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. ఈ వ్యాఖ్యలను క్రిష్‌ ఇంతలా బన్నీని ఆకాశానికి ఎత్తడం చూసి.. త్వరలో బన్నీతో క్రిష్‌ ఓ సినిమా చేయాలని భావిస్తున్న వార్తలు వస్తూనే ఉన్నాయని, అందుకే బన్నీని క్రిష్‌ ఈ లెవల్లో పొగడ్తలతో ముంచెత్తుతున్నాడని విశ్లేషిస్తున్నారు. కాగా త్వరలో క్రిష్‌ మరో మెగాహీరో వరుణ్‌తేజ్‌తో చేసిన కంచె విడుదలకు సిద్దమవుతోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs