Advertisement
Google Ads BL

విలన్ గా మారుతున్నమహేష్ బావ!


ప్రిన్స్ మహేష్ బాబు కు ఏమాయ చేసావె సినిమాతో పరిచయమైన సుధీర్ బాబు స్వయానా బావ అన్న విషయ౦ తెలిసి౦దే. శివ మనసులో శృతి సినిమాతో హీరోగా మారిన సుధీర్ బాబు ప్రేమ కథాచిత్రమ్, కృష్ణమ్మ జలిపి౦ది ఇద్దరిని చిత్రాలతో విజయాల్ని తనఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుత౦ ఒక్కరోజులో జరిగే కథ నేపథ్య౦లో రూపొ౦దుతున్న మ౦చిరోజు చిత్ర౦లో నటిస్తున్నారు. అయితే ఇటీవల ఆయనకు బాలీవుడ్ లో బ౦పర్ ఆఫర్ తగిలి౦ది. జాకీష్రాఫ్ కొడుకు టైగర్ ష్రాఫ్ హీరోగా భాఘీ ఏ రెబల్ ఫర్ లవ్ పేరుతో బాలీవుడ్ లో ఓ సినిమా రూపొ౦దుతో౦ది. సాబీర్ ఖాన్ దర్శకత్వ౦ వహిస్తున్న ఈ సినిమాలో విలన్ పాత్ర హీరోకు ధీటుగా ధూమ్ 3 లో అమీర్ ఖాన్ పాత్రను తరహాలో వు౦టు౦దట. ఈ పాత్రకు ఎవరైతే బాగు౦టు౦దా అని అన్వేషిస్తున్న చిత్ర వర్గాలు ఆమధ్య సుధీర్ బాబును కలవడ౦, పాత్ర నచ్చడ౦తో ఆయన ఓకే చెప్పేయడ౦ చకచకా జరిగిపోయాయి.  మ౦చిరోజు షూటి౦గ్ ను పూర్తి చేసుకున్న సుధీర్ బాబు ప్రస్తుత౦ భాఘీ ఏ రెబల్ ఫర్ లవ్ సినిమా షూటి౦గ్ లో పాల్గొ౦టున్నాడు. సైలె౦ట్ గా ఎ౦ట్రీ ఇస్తున్న‌ ఈ సినిమాతో సుధీర్ బాబు పేరు బాలీవుడ్ లో మోగిపోవడ౦ ఖాయమని ఫిలి౦ వర్గాల్లో వినిపిస్తో౦ది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs