Advertisement
Google Ads BL

గన్నారెడ్డి విషయంలో మాట మార్చిన గుణశేఖర్‌.!


అనుష్క, గుణశేఖర్‌ల రుద్రమదేవి చిత్రానికి డివైడ్‌ టాక్‌ వున్నప్పటికీ కలెక్షన్లపరంగా స్ట్రాంగ్‌గానే వుంది. టైటిల్‌ రోల్‌ చేసిన అనుష్కని, డైరెక్టర్‌ గుణశేఖర్‌ని ఇండస్ట్రీ ప్రముఖులు, ప్రేక్షకులు ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇదిలా వుంటే ఈ చిత్రంలో గోన గన్నారెడ్డి క్యారెక్టర్‌ చేసిన అల్లు అర్జున్‌కి స్పెషల్‌ అప్రిషియేషన్‌ లభిస్తోంది. ఈ క్యారెక్టర్‌ చేస్తానని బన్నీ వాలంటరీగా తనని అడిగాడని గుణశేఖర్‌ మొదటి నుంచీ చెప్తున్నాడు. ఈమధ్య జరిగిన ఓ ప్రెస్‌మీట్‌లో గోన గన్నారెడ్డి క్యారెక్టర్‌ చేయమని మహేష్‌, ఎన్టీఆర్‌ వంటి హీరోలను కూడా అప్రోచ్‌ అయ్యారు కదా! అని అడిగినపుడు.. అలా ఏం జరగలేదని, గోన గన్నారెడ్డి క్యారెక్టర్‌ గురించి వారితో డిస్కస్‌ చేశానంతేనని చెప్పుకొచ్చాడు గుణశేఖర్‌. ఈరోజు జరిగిన రుద్రమదేవి సక్సెస్‌మీట్‌లో మాత్రం గోన గన్నారెడ్డి క్యారెక్టర్‌ చేయమని ఎంతో మందిని అప్రోచ్‌ అయ్యానని, ఎవరూ చేయలేదని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పాడు. ఆ క్యారెక్టర్‌ ఎవరు చేయాలని రాసి పెట్టి వుంటే వారి దగ్గరకే వస్తుందని, ఆ అదృష్టం అల్లు అర్జున్‌కి దక్కిందని చెప్పాడు. ఒక్కసారి ఫ్లాష్‌ బ్యాక్‌లోకి వెళ్తే మహేష్‌, ఎన్టీఆర్‌ ఈ క్యారెక్టర్‌ చెయ్యడం లేదని డిసైడ్‌ అయిన మరుసటి రోజే ప్రెస్‌మీట్‌ పెట్టి గోన గన్నారెడ్డి క్యారెక్టర్‌ అల్లు అర్జున్‌ చేస్తున్నట్టు ప్రకటించాడు గుణశేఖర్‌. ఇది అల్లు అర్జున్‌కి ఒక విధంగా అదృష్టమనే చెప్పాలి. ఇప్పటివరకు అతను చేసిన ఫుల్‌లెంగ్త్‌ క్యారెక్టర్స్‌కి రాని స్పెషల్‌ అప్రిషియేషన్‌ రుద్రమదేవి చిత్రంలో చేసిన గోన గన్నారెడ్డి క్యారెక్టర్‌కి వచ్చింది. మరి ఈ క్యారెక్టర్‌ కోసం ఇతర హీరోలను కూడా అప్రోచ్‌ అయ్యానని చెప్పడానికి గుణశేఖర్‌కి ఎందుకంత నామోషీ.!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs