బాహుబలి చిత్రంతో రాజమౌళికి ఇంటర్నేషనల్ రేంజ్ లో ఇమేజ్ వచ్చింది. ఆ సినిమా పార్ట్2 కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా తమిళనాడు లోని ఓ కళాశాల విద్యార్థుల పరీక్ష పత్రాల్లో బాహుబలి సినిమా వార్ ఎపిసోడ్ ను ఎలా డిజైన్ చేసారనే ప్రశ్న అడిగిన విషయం తెలిసిందే. ఈ సంవత్సరం మొదట్లో రాజమౌళి మద్రాస్ ఐఐటి కాలేజీకి వెళ్లి విధ్యార్ధులతో ముచ్చటించారు. తాజాగా ఆ కళాశాల కల్చరల్ డిపార్ట్మెంట్ నుండి రాజమౌళి కి ఆహ్వానం అందింది. ఈ మేరకు అక్టోబర్ 17న జక్కన్న మద్రాసుకు వెళ్లి స్టూడెంట్స్ కు బాహుబలి సినిమాకు సంబంధించిన క్లాస్ తీసుకోబోతున్నాడట. దీనిని బట్టి రాజమౌళి కి యూత్ లో ఉన్న క్రేజ్ ఏంటో తెలుస్తుంది.