రుద్రమదేవి చిత్రానికి పోటీగా బ్రూస్ లీ చిత్రం విడుదల చేయడం ఇండస్ట్రీకి ఆరోగ్యకరం కాదని బ్రూస్ లీ ను వాయిదా వేయాలంటూ కొందరి మాటలు వినిపించాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు లాంటి సీనియర్ దర్శకుడైతే బ్రూస్ లీ సినిమా వాయిదా వేస్తేనే రుద్రమదేవి కి లాభాలొస్తాయని చెప్పుకొచ్చారు. రుద్రమదేవి చిత్రంలో ముఖ్య పాత్ర పోషించిన అల్లు అర్జున్ ఈ విషయంపై స్పందించారు. చరణ్ నటిస్తున్న బ్రూస్ లీ చిత్రం విడుదల చేయడంలో ఎలాంటి తప్పు లేదని చెప్పాడు. మొదట రుద్రమదేవి సినిమా సెప్టెంబర్ 4 న విడుదలవుతుందని చెప్పారు కాని అది కాస్త పోస్ట్ పోన్ చేసి అక్టోబర్ 9 న రిలీజ్ చేసారు. కాని బ్రూస్ లీ సినిమా ముందు నుండి చెప్తున్నట్లు అక్టోబర్ 16 నే విడుదల చేస్తున్నారు. బ్రూస్ లీ చిత్రం విడుదలవుతుందనే విషయం తెలిసే రుద్రమదేవిని రిలీజ్ చేసారు. కాని ఇప్పుడు కొందరు బ్రూస్ లీ ఓవర్ లాప్ చేస్తుందనడం కరెక్ట్ కాదు. రెండు సినిమాల మార్కెట్ సమానంగా ఉండాలని ఆశిస్తున్నానని తన ట్విట్టర్ లో చెప్పుకొచ్చాడు.