రామ్ చరణ్ తమిళంలో సూపర్ హిట్ అయిన తనీ ఒరువన్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నాడు. ఆయన తండ్రి చిరంజీవి 150వ చిత్రంగా కత్తి సినిమాను రీమేక్ చేయనున్నాడు. ఇప్పుడు వీరి బాటలోనే మరో మెగా హీరో జాయిన్ అయ్యాడు. గౌరవం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయిన అల్లు శిరీష్ కు మొదటి చిత్రమే నిరాశ మిగిల్చింది. ఆ తరువాత రిలీజ్ అయిన కొత్త జంట తో ఓకే అనిపించుకున్నాడు. ప్రస్తుతం ఈ మెగా హీరో యామురిక్క బయమెయ్ అనే తమిళ చిత్రాన్ని రీమేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. తమిళ నాట రిలీజ్ అయిన ఈ హారర్ చిత్రం మంచి కలెక్షన్స్ సాధిస్తుంది. సో.. ఈ సారి ఎలా అయినా కమర్షియల్ హిట్ కొట్టాలనే ఉద్దేశ్యంతో శిరీష్ ఈ సినిమాను రీమేక్ చేయాడానికి డిసైడ్ అయిపోయాడు. మరి ఈ మెగా హీరోలకు తమిళ రీమేక్ లు ఎంతవరకు కలిసోస్తాయో చూడాలి..!