Advertisement
Google Ads BL

సాక్షిలో అస్త వ్యస్త పాలన..!


తెలుగునాట ఈనాడుకు ప్రత్యామ్నాయంగా మారుతుందనుకున్న సాక్షి  దినపత్రిక రేసులో ఇప్పుడు పూర్తిగా వెనుకబడిపోయింది. రోజురోజుకూ పడిపోతున్న పత్రిక సర్కులేషన్‌ యాజమాన్యాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే సమయంలో సాక్షిలోని పెద్దల అనాలోచిత చర్యల కారణంగా ఆ పత్రిక భవిష్యత్తు ఇప్పుడు సంకటంలో పడింది.

Advertisement
CJ Advs

ఎన్నికల ముగిసిన అనంతరం అటు తెలంగాణలో ఇటు ఏపీలో కూడా సాక్షి దినపత్రిక సర్కులేషన్‌ 3 లక్షలకుపైగా పడిపోయింది. ఈ సమయంలో సర్కులేషన్‌ పెంచుకోవడంపై దృష్టి సారించని యాజమాన్యం ఉద్యోగుల సంఖ్యలో కోత పెట్టి వారందర్నీ ఆందోళనకు గురిచేసింది. అంతేకాకుండా కాస్ట్‌ కట్టింగ్‌ పేరుతో యూనిట్లను క్లబ్‌ చేస్తూ దూరప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులను కూడా అప్పటికప్పుడు ఇతర జిల్లాలకు వెళ్లాల్సిందిగా ఆదేశించింది. ఇక తప్పని పరిస్థితుల్లో కొందరు ఆయా ప్రదేశాలకు వెళ్లగా మిగిలిన వారు ఉద్యోగాలను మానేశారు. మళ్లీ ఇప్పుడు యూనిట్ల క్లబ్బింగ్‌తో సాధించేదేమీ లేదని ఆయా ఎడిషన్లను తిరిగి ఆయా జిల్లాలకు పంపించే పనిలో పడింది. కుటుంబాలను, పిల్లల చదువులను పట్టించుకోకుండా ఉద్యోగుల జీవితాలతో సాక్షి యాజమాన్యం ఆడుకుంటోందని అందులో పనిచేస్తున్న విలేకరులు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. అసలు తమను ఎందుకు సొంత జిల్లాలనుంచి ఇక్కడకు తీసుకొచ్చారు.. మళ్లీ ఇప్పుడు ఎందుకు అక్కడికి పంపిస్తున్నారో అర్థంకాక ఉద్యోగులు సతమతమవుతున్నారు.

ఇక ఈ విషయాన్ని పక్కనపెట్టి వేతనాల వద్దకు వస్తే.. సాక్షిలో ఉన్నతస్థానాల్లో ఉన్న వారు ఆడింది ఆటగా పాడింది పాటగా సాగుతోంది. మొదట్లో అన్ని దినపత్రికలకంటే అధిక వేతనాలు అంటూ సాక్షిలోకి ఉద్యోగులను రప్పించుకున్న జగన్‌ కో వర్గం ఆ తర్వాత వేతనాలు పెంచకుండా ఉద్యోగులను మోసం చేసింది. ఈనాడులో పనిచేసి సాక్షిలోకి వచ్చిన ఉద్యోగులకు గత ఏడేళ్ల కాలంలో వందల రూపాయల మీద వేతనాలు పెరగగా.. అదే ఈనాడులో వేతనాలు రెట్టింపయ్యాయి. చివరి రెండేళ్లుగా యాజమాన్యం ఉద్యోగుల వేతనాలను పైసా కూడా పెంచలేదు. పైపెచ్చు వారిపై పనిభారాన్ని తీవ్రంగా పెంచి.. పనిచేయకుంటే ఉద్యోగాలు పోతాయంటూ హెచ్చరికలు పంపిస్తోంది. సరే పత్రిక కష్టాల్లో ఉంది కనుక వేతనాలు పెంచలేకపోయిందని సర్దుకుపోదామనుకున్నా.. యాజమాన్యం తీరు అందుకు సరిపడటం లేదు. ఉన్నత స్థానాల్లో ఉన్న ఉద్యోగులను సింగపూర్‌, మలేషియాలకు ఫారన్‌ ట్రిప్పులకు పంపిస్తూ.. చిన్న స్థాయిలో ఉన్న ఉద్యోగులకు రూపాయి వేతనం కూడా పెంచడం లేదు. విదేశాల విహారయాత్రలకు రూ. కోట్లలో ఖర్చు అవుతుందని.. అదే తమకు వేతనాలు పెంచితే అందులో సగం కూడా ఖర్చు కాదని చిన్నస్థాయి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం సాక్షి బాధ్యతలను చేపట్టిన వైఎస్‌ భారతి వ్యవహారం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కిందిస్థాయి ఉద్యోగుల కడుపులు మాడ్చుతూ.. ఉన్నత స్థానాల్లో అధిక వేతనాలు పొందుతున్న వారిని ఫారిన్‌ ట్రిప్పులకు పంపించడం.. మరో అస్త వ్యస్త పాలనను గుర్తు చేస్తోంది.

Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs