Advertisement
Google Ads BL

అనుష్క పారితోషికం ఎంతో తెలుసా?


గ్లామర్ రోల్స్‌తో కెరీర్ ప్రారంభించిన అనుష్క అరుంధతి చిత్రంలో తన అభినయ పటిమతో అందర్నీ ఆకట్టుకుంది. ఆ తర్వాత రోజు రోజుకు పెరుగుతున్న ఆమె పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి లో దేవసేనగా డీగ్లామర్ రోల్ కనిపించినా తన ప్రాభవాన్ని చాటుకుంది ఈ యోగా బ్యూటీ. ఇక ఇటీవల విడుదలైన రుద్రమదేవి తో తారాపథంలోకి దూసుకెళ్లిన అనుష్క ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్‌కేక్. అనుష్క నటించిన రుద్రమదేవి తొలి మూడురోజుల్లోనే 25 కోట్ల షేర్ రాబట్టింది. ఓ స్టార్ హీరో సినిమాకు ఏ మాత్రం తగ్గని రీతిలో ఈ చిత్రానికి ప్రారంభ వసూళ్లు లభించాయి. ఇక ఇప్పుడు అనుష్క ప్రధాన పాత్రలో ఆమెతో భారీ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు నిర్మాతలు. అంతేకాదు ఆమెకు 3 నుంచి 5 కోట్ల పారితోషికం కూడా ఇచ్చేందుకు సిద్ధంగా వున్నారు. అయితే అనుష్క మాత్రం పారితోషికాన్ని ప్రాముఖ్యతనివ్వకుండా కథ నచ్చితేనే చిత్రాల్ని అంగీకరించాలనే నిర్ణయం తీసుకుందట.!

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs