రామ్ చరణ్ బ్రూస్ లీ తరువాత తనీ ఒరువన్ తమిళ సినిమా రీమేక్ లో నటించనున్నాడు. ఈ సినిమా రీమేక్ చేయాలనుకున్నప్పుడు తమిళంలో విలన్ గా నటించిన అరవింద్ స్వామీనే తెలుగులో కూడా నటింపజేయాలనుకున్నారు. కాని ఆయన రీమేక్ లో నటించడానికి ఆసక్తి చూపలేదు. దీంతో విలన్ గా రానా లేదా మాధవన్ నటిస్తారని వార్తలు వచ్చాయి. కాని ఈ వార్తలన్నింటికి తెర పడింది. విలన్ గా అరవింద్ స్వామీ అయితేనే న్యాయం చేయగలడని అతన్నే కన్ఫర్మ్ చేసారట. అరవింద్ కి కూడా అదే విషయాన్ని చెప్పి ఒప్పించారట. భారీ పారితోషికం కూడా ఇస్తున్నారని సమాచారం. తమిళంలో సిద్ధార్థ్ అనే పాత్రలో నటించిన అరవింద్ స్వామీ నటన సినిమాకే హైలైట్ గా నిలిచింది. మరి తెలుగులో ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో.. చూడాలి..!