ప్రస్తుతం రానా బాహుబలి2 పైనే తన ఫోకస్ అంతా పెట్టాడనుకుంటే మాత్రం పొరపాటే. ప్రస్తుతం తన ఖాతాలో బాహుబలి2 కాకుండా మరో మూడు సినిమాలున్నాయి. బెంగుళూరు డేస్ తమిళ రీమేక్ చిత్రంలో నటిస్తున్నాడు. అది కాకుండా ప్రేమ్ రక్షిత్, సంకల్ప్ అనే ఇద్దరు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రానా. ప్రేమ్ రక్షిత్ దర్శకత్వంలో లో నటించబోయే సినిమా షూటింగ్ దసరా నుండి ప్రారంభించనున్నారు. ఇందులో రానా కు జోడీగా రెజీనా నటిస్తుంది.
ఇక సంకల్ప్ దర్శకత్వంలో రానా చేయబోయేది ఓ డిఫరెంట్ ఫిలిం. ఇండియా పాకిస్తాన్ వార్ బ్యాక్ డ్రాప్ లో ఓ సబ్ మెరైన్ మిస్టరీని తెరపై చూపించే ప్రయత్నం చేయబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా సమంతా చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.