దర్శకుడు రాజమౌళి ఏదైనా సినిమా చూసిన తర్వాత ఆ సినిమాలో తనకు నచ్చిన అంశాలను నిర్మొహమాటంగా బయటపెడుతుంటాడు. తాజాగా విడుదలైన రుద్రమదేవి సినిమా చూసిన తర్వాత రాజమౌళి.. గోనగన్నారెడ్డి పాత్రను పోషించిన అల్లుఅర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. అల్లుఅర్జున్ పోషించిన గోనగన్నారెడ్డి పాత్ర సినిమాకే హైలైట్ అయిందని, ఆ పాత్ర వల్లే సినిమాపై మరింత ఆసక్తి పెరిగిందని రాజమౌళి ట్వీట్ చేశాడు. బన్నీ కేవలం ఆన్ ది స్క్రీన్‌లోనే కాదు.. ఆఫ్ స్క్రీన్‌లోనూ హీరోనే అని అంటూ కితాబిచ్చాడు. రుద్రమదేవి సినిమా ఆగిపోయిన సమయంలో బన్నీ.. గోనగన్నారెడ్డి పాత్ర చేయడానికి ఒప్పుకొని సినిమాను నిలబెట్టాడు.. అని చెప్పుకొచ్చాడు. పన్ను మినహాయింపు విషయంలో బన్నీ రోల్ ఎంతో కీలకం. రెస్పెక్ట్ గోనగన్నారెడ్డి... అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు.