ఇప్పుడున్న హీరోయిన్లలో రకుల్‌ప్రీత్‌సింగ్ హవా బాగా కొనసాగుతోంది. ఇక ఇటీవల వచ్చిన హీరోయిన్లలో తమన్నాతర్వాత అంత ఈజ్‌గా డ్యాన్స్ చేయగలిగిన భామ రకుల్. ఆమె మాట్లాడుతూ... రామ్‌చరణ్ వంటి పెద్ద హీరోతో తొలిసారి నటిస్తున్నాను. ఈ సినిమాలో నేను ఎంతో గ్లామర్‌గా ఉన్నానని అందరూ అంటున్నారు. నా లుక్ కోసం దర్శకుడు శ్రీనువైట్ల చాలా కష్టపడ్డాడు. చరణ్‌తో డ్యాన్స్ చేయడం చాలా కష్టం. సాంగ్ షూటింగ్‌కు రెండు రోజుల ముందు నుంచే సాధన చేసేదాన్ని, ఈ విషయంలో చెర్రి నాకు అన్నివిధాల సహకరించేవాడు. ఆయనకు ఈ సందర్బంగా థ్యాంక్స్ చెబుతున్నాను... అంటూ చరణ్‌పై రకుల్ ప్రశంసల వర్షం కురిపించింది. చరణ్‌తో డ్యాన్స్ చేయడానికే ఇంత కష్టపడిన ఈ బ్యూటీ ఇక ఎన్టీఆర్, అల్లుఅర్జున్.....వంటి హీరోలతో కూడా కలిసి నటిస్తోంది. మరి వారి పక్క ఆమె ఏమాత్రం నిలబడగలదో వేచిచూడాల్సివుంది!