అఖిల్ హీరోగా తన తొలి చిత్రాన్ని నితిన్ నిర్మాతగా వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో చేస్తున్న చిత్రం అఖిల్. ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్దమవుతోంది. ఈ సినిమా రిలీజ్ అయితే గానీ అఖిల్ రేంజ్ ఏమిటో? ఎవ్వరికీ అర్థం కాదు. ఆయన మార్కెట్ ఎంత? ఆయనకున్న క్రేజ్ ఎలాంటిది? అనే విషయాలు సినిమా రిలీజ్ అవ్వనిదే ఎవ్వరూ అంచనా వేసే పరిస్థితి లేదు. అయినా ఈ చిత్రాన్ని నితిన్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఇటీవల ఓ నిర్మాత అఖిల్ డేట్స్ కోసం భారీ రెమ్యూనరేషన్ ఇస్తానని ముందుకు రావడం హాట్‌టాపిక్ అయింది. అఖిల్ నటించే రెండో చిత్రాన్ని తనకు అప్పగిస్తే అఖిల్‌కు 12కోట్ల రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్లు ఆ నిర్మాత అఖిల్ తండ్రి నాగార్జునకు చెప్పాడట. అయితే నాగ్ మాత్రం మొదటి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆలోచిద్దాం.. అని అన్నాడని తెలుస్తోంది. ఇంతవరకు 12కోట్ల రెమ్యూనరేషన్ అందుకుంటున్న స్టార్స్‌లో పవన్, మహేష్ లను మినహాయిస్తే.. రామ్‌చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లుఅర్జున్ వంటివారికి మాత్రమే చోటుంది. మరి రెండో సినిమాతోనే అఖిల్ ఆ రేంజ్‌కు చేరుకుంటాడో లేదో చూడాలి...!