అగ్రనిర్మాత అశ్వనీదత్ కుమార్తె ప్రియాంక దత్ ప్రేమలో పడిందని త్వరలోనే వివాహం కూడా చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. బాణం, సారోచ్చారు చిత్రాలతో నిర్మాతగా మారిన ప్రియాంక రీసెంట్ గా స్వప్న సినిమాస్ పతాకంపై ఎవడే సుబ్రమణ్యం చిత్రాన్ని నిర్మిచారు. ఆ సినిమాతో నాగ అశ్విన్ అనే దర్శకుడు పరిచయమయ్యాడు. నాని హీరోగా నటించిన ఈ చిత్రం మంచి ప్రశంసలే అందుకుంది. సినిమా షూటింగ్ సమయంలో ప్రియాంక చిత్ర దర్శకుడు నాగ అశ్విన్ తో ప్రేమలో పడిందట. వీరిద్దరి ప్రేమకు ఇరువైపుల కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో త్వరలోనే పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అశ్వనీదత్ త్వరలోనే అఫీషియల్ గా తెలియజేయనున్నారట..!