Advertisement
Google Ads BL

అఖిల్‌ను వేదిస్తున్న సెంటిమెంట్‌..!


అక్కినేని అఖిల్‌ హీరోగా తన డెబ్యూ మూవీకే తన పేరునే టైటిల్‌గా అఖిల్‌ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఓ సెంటిమెంట్‌ మాత్రం అక్కినేని అభిమానులతో పాటు అఖిల్‌ను కూడా వెంటాడుతోంది. ఇప్పటివరకు టాలీవుడ్‌ సినీ చరిత్రలో హీరో రియల్‌ పేరుతో వచ్చిన సినిమాలు హిట్టయిన దాఖలాలు లేవు. మెగాస్టార్‌ చిరంజీవి కూడా చిరంజీవి పేరుతో ఓ సినిమా చేశాడు. ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాపడింది. ఇక అఖిల్‌ తండ్రి నాగార్జున కూడా తన కెరీర్‌ ప్రారంభంలో కెప్టెన్‌ నాగార్జున అనే చిత్రం చేశాడు. ఈ చిత్రం కూడా అట్టర్‌ఫ్లాప్‌గా నిలిచింది. ఇలా చెప్పుకోవడానికి నాలుగైదు మంచి ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇక ఈ తరానికి వస్తే మంచు విష్ణు కూడా ఆమధ్య విష్ణు అనే టైటిల్‌తో ఓ సినిమా చేశాడు. కానీ అది కూడా సేమ్‌ రిజల్ట్‌నే సాధించింది. మరి అక్కినేని అఖిల్‌ తన మొదటి సినిమా అఖిల్‌ ద్వారా హిట్టు సాధించి ఈ సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేస్తాడా? లేక మిగతా వారిలాగా ఆ సెంటిమెంట్‌తో ఫ్లాప్‌ను మూటగట్టుకుంటాడా? అనేది ఇప్పుడు అందరికీ ఆసక్తిని కలిగిస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs