Advertisement
Google Ads BL

మరోసారి పూరి కాంబినేషన్‌లో ఛార్మి


ఛార్మి ప్రధాన పాత్రలో పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో సి.కళ్యాణ్‌ నిర్మించిన జ్యోతిలక్ష్మీ సంచలనం సృష్టించిందో లేక సంచలనం సృష్టించిందన్న భ్రమ కలిగించిందో తెలీదు గానీ మొత్తానికి ఆ సినిమా రిలీజ్‌కి ముందు, రిలీజ్‌ తర్వాత విపరీతమైన పబ్లిసిటీతో మాత్రం సంచలనమే సృష్టించింది. ఇప్పుడు మళ్ళీ పూరి, ఛార్మి కలిసి పనిచేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఛార్మి హీరోయిన్‌ కాదు, పూరి జగన్నాథ్‌ డైరెక్టరూ కాదు. సౌత్‌ ఇండియాలో నటిగా, దర్శకురాలిగా మంచి పేరు తెచ్చుకున్న రేవతి డైరెక్ట్‌ చెయ్యబోతున్న ఓ సినిమాకి ఛార్మి నిర్మాత. ఈ చిత్రానికి స్టోరీ, స్క్రీన్‌ప్లే పూరి జగన్నాథ్‌ అందిస్తున్నాడట. మిత్ర్‌, ఫిర్‌ మిలేంగే, కేరళ కేఫ్‌ వంటి డిఫరెంట్‌ చిత్రాలను డైరెక్ట్‌ చేసిన రేవతి ఇప్పుడు పూరి కథని డైరెక్ట్‌ చెయ్యబోతోంది. అయితే ఈ సినిమాని ఛార్మి నిర్మించేందుకు ఎందుకు ఉత్సాహం చూపిస్తుందో ఎవరికీ అర్థం కావడంలేదు. మరి ఈ సినిమాలో ఛార్మి కూడా నటిస్తుందా? లేక నిర్మాతగానే వ్యవహరిస్తుందా? ఒకవేళ నటిస్తే ఎలాంటి క్యారెక్టర్‌ చేస్తుందనేది ఇంకా తెలియాల్సి వుంది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి డీటైల్స్‌ త్వరలోనే అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేసే అవకాశం వుందని తెలుస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs