లోకనాయకుడు కమల్‌హాసన్‌పై తీవ్ర విమర్శలు సంధించాడు మరో సీనియర్ నటుడు శరత్‌కుమార్. కమల్‌ను విశ్వాసం లేని వాడిగా అభివర్ణించాడు. నడిగర్ సంఘానికి ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో శరత్‌కుమార్, విశాల్ ప్యానెల్స్ పోటీపడుతున్నాయి. కమల్ పరోక్షంగా విశాల్‌కు మద్దతు ఇస్తున్నాడట. దీంతో నొచ్చుకున్న శరత్‌కుమార్ కమల్‌పై విమర్శలకు దిగాడు. కమల్ విశ్వరూపం, ఉత్తమవిలన్ చిత్రాల విడుదల సమయంలో ఎదురైన సమస్యలను పరిష్కరించడానికి నేను ఎంతో సహాయపడ్డాను. అలాగే రాధిక కూడా ఎంతో సాయం చేసింది. అంతేకాదు కమల్‌తో తమకు వ్యక్తిగతమైన అనుబంధం ఉంది. ఎన్నికలలో పోటీ తధ్యమైన వేళ కనీసం తమను సంప్రదించాల్సింది. కానీ కమల్ అలా చేయలేదు. ఆయనకు కృతజ్ఞత కూడా లేదు అని అని విమర్శించాడు శరత్‌కుమార్. ఈ మద్య సినిమా వాళ్ల ఎన్నికలకు కూడా సాధారణ ఎన్నికలను తలపిస్తున్నాయి. ఇటీవల మా కు జరిగిన ఎన్నికలు కూడా రాజకీయాలను తలపించాయి. ఇప్పుడు తమిళంలో కూడా ఒకరిపై ఒకరు విమర్శలకు దిగి తమకున్న హుందాతనాన్ని దిగజార్చుకుంటున్నారు.