ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లో నితిన్, సమంత, అనుపమ పరమేశ్వరన్, నదియా వంటి వారు నటిస్తున్న చిత్రం అ..ఆ. కాగా ఈ చిత్రంలో మరో నటుడు చేరాడు. ఆయనే నటుడు కమ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్. ఈ చిత్రంలో ఓ కీ రోల్ కోసం ఆయన్ను సంప్రదించడం, ఆయన ఓకే చేయడం జరిగిపోయింది. ప్రస్తుతం నారా రోహిత్‌తో సినిమా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తూ.. ప్రీపొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న అవసరాల శ్రీనివాస్ త్రివిక్రమ్ సినిమా అనగానే ఎగిరి గంతేసి ఓకే చెప్పేశాడట. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. 2016 సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు. మరి నటునిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న అవసరాలకు ఈ చిత్రం ఎంతటి పేరు ప్రఖ్యాతులు తెస్తుందో వేచిచూడాల్సివుంది...!