Advertisement
Google Ads BL

జోరు చూపిస్తున్న మెగామేనల్లుడు..!


మొదట్లో మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా చేస్తున్నాడు అని అంటే ఆయన ఫేస్‌ చూసి ఈయనేమిటి? హీరో ఏమిటి? అని కామెంట్స్‌ చేసిన వారు ఎందరో ఉన్నారు. రేయ్‌ చిత్రంతో తెలుగులో మొదటి సినిమా చేసినప్పటికీ దానికంటే ఆయన నటించిన రెండో చిత్రం పిల్లా...నువ్వులేని జీవితం మొదటగా విడుదలై మంచి విజయం సాధించింది. ఆ తర్వాత వచ్చిన రేయ్‌ చిత్రం విడుదలై డిజాస్టర్‌గా నిలిచినప్పటికీ సాయి కెరీర్‌పై ఈ చిత్రం ఎలాంటి ఎఫెక్ట్‌ చూపించలేకపోయింది. తాజాగా దిల్‌రాజు నిర్మాతగా,హరీష్‌శంకర్‌ దర్శకత్వంలో వచ్చిన సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌ ఇప్పటికే దాదాపు 20కోట్లు కొల్లగొట్టింది. మరి సాయికి వచ్చిన, వస్తున్న చిత్రాలు కేవలం ఆయన మెగాహీరో కావడమా? లేక ఆయనలో సత్తా చూశా..? అనే విషయమై ఫిల్మ్‌సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. కేవలం మెగాహీరో అయితే ఒకటిరెండు సినిమాలు అయితే ఓకే కానీ.. వరుసగా మరో మూడు చిత్రాలు ఆయనకు లభించడం కేవలం ఆయన సత్తా చూసే అని అంటున్నారు. ముఖ్యంగా ఆయనకు టాప్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌రాజు అండదండలు ఉండటం మాత్రం ఆయన కెరీర్‌కు బాగా ఉపయోగపడుతోంది... అనేది మాత్రం వాస్తవం. ఆయన అనిల్‌రావిపూడి దర్శకత్వంలో సుప్రీమ్‌, సునీల్‌రెడ్డి డైరెక్షన్‌లో తిక్క, దిల్‌రాజు నిర్మించే శతమానం భవతి చిత్రాలు చేస్తున్నాడు. నటనలో ఈజ్‌ ఉండటం, డైలాగ్‌ మాడ్యులేషన్‌ బాగా ఉండటం, ఇక డ్యాన్స్‌ల్లో, ఫైట్స్‌లో ఇరగదీయడం.. వంటి వాటితో పాటు తన మేనమామల పోలిక, వారి తరహా నటన ఉండటం కూడా సాయికి ప్లస్‌ పాయింట్‌ అవుతోంది. తనదైన పక్కా ప్లానింగ్‌తో దూసుకుపోతున్నాడు. ఇక ఆయన నుండి మరో రెండు మూడు హిట్లు వస్తే మాత్రం మిగిలిన మెగాహీరోల్లలాగా ఆయన స్టార్‌ హీరోగా గుర్తింపు తెచ్చుకోవడం ఖాయమని ట్రేడ్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs