Advertisement
Google Ads BL

చరణ్‌ను బాగా వాడేసుకుంటున్న శ్రీనువైట్ల..!


వాస్తవానికి టాలీవుడ్‌లో డ్యాన్స్‌ విషయంలో మెగాస్టార్‌ తర్వాతే ఎవరైనా. ఇది కాదనలేని సత్యం. అయితే యంగ్‌ స్టార్స్‌లో బన్నీ, ఎన్టీఆర్‌ వంటి హీరోలు కూడా మంచి డ్యాన్సర్స్‌గా పేరుతెచ్చుకుంటున్నారు. డ్యాన్స్‌ విషయంలో తన తండ్రిలోని సత్తా తనకు ఉన్నప్పటికీ రామ్‌చరణ్‌లోని డ్యాన్సర్‌ను ఎవ్వరూ ఇప్పటివరకు సరిగ్గా ఉపయోగించుకోలేదు. రామ్‌చరణ్‌ చేత కొత్త రకం స్టెప్పులు, డ్యాన్స్‌లు చేయించడంలో ఇప్పటివరకు దర్శకులు ఫెయిల్‌ అయ్యారు. యాక్టింగ్‌లో కేేవలం చరణ్‌లోని మాస్‌ యాంగిల్‌ను ఉపయోగించుకున్నంతగా డాన్సర్‌ను, కామెడీ టైమింగ్‌ను ఏ దర్శకుడు సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు. కేవలం కృష్ణవంశీ మాత్రమే గోవింందుడు అందరివాడేలే చిత్రంలో చరణ్‌ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరయ్యేలా కాస్తోకూస్తో వాడుకున్నాడు. ఇప్పుడు మాత్రం దర్శకుడు శ్రీనువైట్ల రామ్‌చరణ్‌లోని అన్ని యాంగిల్స్‌ను తన బ్రూస్‌లీ చిత్రంలో వాడేసుకుంటున్నాడు. ఈ చిత్రంలో చరణ్‌ వేసే స్టెప్పులు ఆయనకు భారీ ఇమేజ్‌ను తెచ్చేలా, ఇతర హీరోలకు పోటీగా ఇచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ చిత్రంలో స్పీడ్‌ స్టెప్స్‌లో రామ్‌ఛరణ్‌ అదరగొట్టనున్నాడని టాక్‌. ఇంతవరకు తాను ఇంతగా కష్టపడిన స్టెప్స్‌ వేయలేదని, బ్రూస్‌లీలో మాత్రం బాగా కష్టపడ్డానని, అయినా తాను ఆ డ్యాన్స్‌లను బాగా ఎంజాయ్‌ చేశానని ఆమధ్య రామ్‌చరణ్‌ స్వయంగా తెలిపాడు. ఒకేసారి చరణ్‌లోని మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఇమేజ్‌తో పాటు ఫ్యామిలీ సెంటిమెంట్‌ను, కామెడీ యాంగిల్‌ను, ఆయనలోని సూపర్‌ డ్యాన్సర్‌ను ఇలా అన్నింటినీ ఒకే ఒక్క సినిమాతో శ్రీనువైట్ల ఒకేసారి వాడేసుకుంటున్నాడు. మరి ఈ చిత్రం ద్వారా చరణ్‌ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకుంటాడో లేదో వేచిచూడాల్సివుంది..! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs