Advertisement
Google Ads BL

ఆశలు రేపుతోన్న గుణ..!


తన స్వీయ నిర్మాణం, దర్శకత్వంలో గుణశేఖర్‌ దాదాపు 70కోట్లతో తీసిన చిత్రం రుద్రమదేవి. ఎప్పుడో బాహుబలి ముందు విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూ వస్తోంది. ఎట్టకేలకు ఈ నెల 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్దమవుతోంది. తెలుగులోనే కాక తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా ఈ చిత్రం ఒకే రోజున విడుదలకు సిద్దమవుతోంది. వాస్తవానికి ఈ చిత్రం బాహుబలికి ముందు వచ్చి ఉంటే బాగుండేదని చాలామంది అభిప్రాయం. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం విరుద్దంగా ఉంది. బాహుబలి తర్వాత తెలుగు సినిమాల రేంజ్‌ బాగా పెరగడం, తెలుగు సినిమాల వైపు అందరూ ఆసక్తిగా చూస్తుండటం, అందునా బాహుబలి తర్వాత అనుష్క, రానా వంటి వారికి దేశవ్యాప్తంగా గుర్తింపు రావడం వంటవి ఈ రుద్రమదేవి కి ప్లస్‌ కానున్నాయి. ఇక తెలుగులో ఈ చిత్రానికి బన్నీ కీలకపాత్ర పోషించడం, చిరు వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడం వంటివి కావాల్సింత క్రేజ్‌ను తీసుకురావడానికి ఉపయోగపడనున్నాయి. ఇక తమిళ, మలయాళ భాషల్లో అనుష్క, రానా, నిత్యామీనన్‌ వంటి వారి వల్ల సినిమాకు గుర్తింపు వస్తోంది. తాజాగా గుణశేఖర్‌ ఈ చిత్రం ప్రమోషన్‌ను భారీగా చేస్తున్నాడు. ముఖ్యంగా బాలీవుడ్‌పై ఆయన దృష్టి సారిస్తున్నాడు. ఇటీవలే హిందీ వెర్షన్‌కు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశాడు. దీనికి మంచి రెస్పాన్స్‌ లభిస్తోంది. ఇక అన్ని భాషల్లోనూ ఇళయరాజాకు ఉన్న విపరీతంగా ఉన్న క్రేజ్‌ కూడా దానికి ప్లస్‌ కానుంది. ఆయన దాదాపు 70కోట్లు ఎందుకు ఖర్చుపెట్టింది? అనేది సినిమా ట్రైలర్‌ను చూస్తే అర్థం అవుతోంది. సాంకేతికంగా ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలోనే తొలి హిస్టారికల్‌ స్టీరియో ఫోనిక్‌ సిస్టమ్‌లో రూపొందడం.. అందునా త్రీడీలో ఈ చిత్రం రూపొందడం అనేది చిన్న పిల్లల్లో కూడా ఈ చిత్రం ఆసక్తిని క్రియేట్‌ చేస్తుండటం విశేషం. దాంతో ఈసినిమా అక్టోబర్‌ 9న దండయాత్రకు సిద్దమవుతోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs