Advertisement

ప్రభుదేవా భవిష్యత్తు తేలనుంది..!


సినిమా రంగంలోని అన్ని శాఖలలో తనకు బాగా పట్టువుందని నిరూపించుకున్నాడు ఇండియన్‌ మైఖేల్‌ జాక్సన్‌ ప్రభుదేవా. ముఖ్యంగా సౌత్‌లో హిట్‌ అయిన చిత్రాలను బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తూ విజయాలు సాధిస్తున్నాడు ఈ డైరెక్టర్‌. అయితే ఆయనకు ఇటీవల వరుసగా మూడు ఫ్లాప్స్‌ ఎదురయ్యాయి. రామయ్యా వస్తావయ్యా, రాంబో రాజ్‌కుమార్‌, యాక్షన్‌ జాక్సన్‌ చిత్రాలు డిజాస్టర్‌ ఫలితాలను పొందాయి. ఆయన చివరి హిట్‌ అక్షయ్‌కుమార్‌తో చేసిన రౌడీరాథోడ్‌ చిత్రం. ఇప్పుడు ప్రభుదేవా తన పూర్వ వైభవం తెచ్చుకోవడం కోసం తనకు అచ్చివచ్చిన హీరో అక్షయ్‌కుమార్‌తో సింగ్‌ ఈజ్‌ బ్లింగ్‌ చిత్రం చేశాడు. అక్టోబర్‌ 2న విడుదలకు సిద్దమయిన ఈ చిత్రంపై ప్రభుదేవా బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నాడు. మరి ఈ చిత్రంతోనైనా ప్రభుదేవా డూ ఆర్‌ డై పొజిషన్‌ నుండి బయటపడి తనను తాను మరలా నిరూపించుకునే పనిలో పడ్డాడు. ఈ చిత్రం అసల ఫలితం తెలియాలంటే ఓ వారం రోజులు ఆగాల్సిందే...! 

Advertisement
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement