Advertisement
Google Ads BL

తని ఒరువన్‌ రీమేక్‌ ఇలా జరగబోతోంది.!


జయం రవి, మోహన్‌రాజా కాంబినేషన్‌లో రూపొందిన తని ఒరువన్‌ తమిళ్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌ అవడం, ఆ చిత్రం రీమేక్‌లో నటించడానికి రామ్‌చరణ్‌ ఉత్సాహం చూపిస్తున్నాడనీ, ఎన్‌.వి.ప్రసాద్‌, డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని వార్తలు వచ్చాయి. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని విశేషాలు బయటికి వచ్చాయి. ఈ చిత్రానికి దర్శకుడుగా సురేందర్‌రెడ్డిని కన్‌ఫర్మ్‌ చేశారు. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో విలన్‌గా నటిస్తాడని చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ, తమిళ్‌లో విలన్‌గా నటించిన ఒకప్పటి హీరో అరవింద్‌ స్వామి పేరునే పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఆ సినిమాలో విలన్‌ క్యారెక్టర్‌కి చాలా ఇంపార్టెన్స్‌ వుంటుంది. దాన్ని ఫుల్‌ఫిల్‌ చెయ్యాలంటే అరవింద్‌ స్వామి అయితేనే కరెక్ట్‌ అని దర్శకనిర్మాతలు భావిస్తున్నారట. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌ సరసన కాజల్‌ మరోసారి హీరోయిన్‌గా నటిస్తుందని మొదట్లో వార్తలు వచ్చినా ఆ తర్వాత అనేకుడు చిత్రంలో హీరోయిన్‌గా నటించి అందర్నీ మెప్పించిన అమైరా దస్తూర్‌ని హీరోయిన్‌గా తీసుకొనే అవకాశం వుందని తెలిసింది. అయితే కాజల్‌కే ఎక్కువ ప్రిఫరెన్స్‌ ఇస్తున్నట్టు తెలుస్తోంది. రామ్‌చరణ్‌, సురేందర్‌రెడ్డి ఫస్ట్‌ కాంబినేషన్‌లో రూపొందనున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రారంభిస్తారని తెలుస్తోంది. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs