ఈ మాటలు ఎవరివి? 150వ సినిమా చెయ్యబోతున్న చిరంజీవివా? లేక తనే ఆ సినిమాకి డైరెక్టర్ అని ప్రచారం జరుగుతున్న వినాయక్‌వా? అనే డౌట్ మీకు రావచ్చు. ఈ మాటలు అన్నది మాత్రం ముమ్మాటికీ వినాయకే. నిన్న ఓ న్యూస్ ఛానల్‌లో ఆర్భాటంగా చిరంజీవి 150వ సినిమా కన్‌ఫర్మ్ అయిందనీ, కత్తి రీమేక్‌గా తెలుగులో చిరు సినిమా రూపొందుతుందని, వినాయక్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తాడని అఫీషియల్ న్యూస్ చెప్పినంత స్ట్రాంగ్‌గా చెప్పేశారు. నిజానికి చిరంజీవి సినిమాకి తాను డైరెక్టర్ అని వినాయక్‌కి కూడా తెలీదట. ఈమధ్యకాలంలో తనని ఆ సినిమా గురించి ఎవరూ సంప్రదించలేదని, ఈ న్యూస్ ఎలా వచ్చిందో తనకి తెలియదని వినాయక్ అంటున్నాడు. చిరంజీవి 150వ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఎదురు చూసే ప్రేక్షకులు, అభిమానులు ఎంతమంది వున్నారో తెలీదుగానీ ఆ సినిమా గురించి రకరకాల ఊహాగానాలు చేస్తూ, కాంబినేషన్స్ సెట్ చేసేసి ప్రేక్షకుల ముందుంచే వ్యక్తులు మాత్రం చాలా మంది వున్నారు. ఒక న్యూస్ ఛానల్‌లో వచ్చిన ఈ న్యూస్ మీడియా అంతా స్ప్రెడ్ అయిపోవడంతో షాక్ అవడం వినాయక్ వంతు అయింది. దీనికి చిరంజీవి, రామ్‌చరణ్ స్పందన ఏమిటో తెలీదుగానీ మొత్తానికి చిరు 150వ సినిమా వార్త మాత్రం మీడియా అంతా హల్‌చల్ చేస్తోంది.