ఇళయదళపతి విజయ్ హీరోగా శింబుదేవన్ దర్శకత్వంలో తెలుగు, హిందీ, తమిళ భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిన పులి అక్టోబర్ 1న వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ కావాల్సి వుంది. కానీ, ఈ సినిమాకి కూడా రిలీజ్ కష్టాలు తప్పడంలేదు. బుధవారం హీరో విజయ్, హీరోయిన్ సమంత, నిర్మాత, దర్శకుల ఇళ్లపై ఐటి దాడులు నిర్వహించడంతో గురువారం రిలీజ్ అవ్వాల్సిన ఈ చిత్రం రిలీజ్ అవ్వలేదు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు, హీరో విజయ్‌కి మధ్య కొన్ని విభేదాలు వున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ కారణంగానే జయలలిత కావాలని సినిమా రిలీజ్‌కి ముందు ఐటి దాడులు చేయించిందన్న వార్తలు తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి ఫైనాన్స్ చేసిన మెయిన్ ఫైనాన్షియర్లను టార్గెట్ చేసిన ఐటి అధికారులు వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లను సైతం బ్లాక్ చేశారు. దీంతో ఎక్కడి డబ్బు అక్కడే ఆగిపోవడం వల్ల సినిమా రిలీజ్‌కి ఆటంకం ఏర్పడింది. బ్యాంక్ క్లియరెన్స్ ఇస్తే తప్ప మ్యాట్నీ షో నుంచి అయినా ఈ సినిమా వేసే అవకాశం లేదు. వరల్డ్‌వైడ్‌గా అన్ని మల్టిప్లెక్సుల్లో బుక్ అయిన టిక్కెట్లను సైతం క్యాన్సిల్ చేసి రీఫండ్ ఇచ్చేస్తున్నారట. పులి తెలుగు డబ్బింగ్ హక్కులు తీసుకున్న ఎస్‌విఆర్ మీడియా అధినేత్రి శోభారాణి కూడా ప్రస్తుతం చెన్నయ్‌లో వున్నారట. దీనికి సంబంధించి బ్యాంక్ క్లియరెన్స్ ఎప్పుడవుతుందా? ఎప్పుడు షోస్ పడతాయా అని అందరూ ఎదురుచూస్తున్నారు.