సూపర్ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అరుంధతి సినిమాతో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న నటి అనుష్క శెట్టి. ప్రస్తుతం ఈ భామ నటించిన సైజ్ జీరో, రుద్రమదేవి చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. సైజ్ జీరో సినిమా కోసం స్వీటీ సుమారుగా ఇరవై కేజీల బరువు పెరిగింది. ఇప్పుడు ఈ భామ తన బరువును తగ్గించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. యోగాతో తన శరీరాన్ని పర్ఫెక్ట్ గా చూసుకునే ఈ బ్యూటీకి కూడా లైపో చేయించుకునే పరిస్థితి ఏర్పడింది. ఆపరేషన్ కోసం అనుష్క సింగపూర్ లేదా మలేషియా వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటుందట. త్వరలోనే తను నటించిన రెండు సినిమాల ప్రమోషన్స్ లో పాల్గొనడానికే అనుష్క లైపో చేయించుకోవడానికి డిసైడ్ అయిందని సమాచారం.