యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్‌కు మంచి హిట్ వచ్చి చాలాకాలం అయింది. ఎప్పుడో వచ్చిన కందిరీగ తర్వాత ఆస్థాయి హిట్ మరలా రామ్‌కు రాలేదు. పండగచేస్కో చిత్రం కేవలం ఫర్వాలేదనిపించింది. దీంతో తాజాగా అక్టోబర్ 2వ తేదీన సోలోగా వస్తున్న శివమ్ చిత్రంపై రామ్ బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నాడు. కాగా తెలుగులో కూడా తన మార్కెట్‌ను విస్తరింపజేయాలని తమిళ స్టార్ విజయ్ ఎప్పటినుండో ప్రయత్నిస్తున్నాడు. కానీ ఆయనకు తెలుగులో అనుకున్న క్రేజ్ రావడం లేదు. దాంతో ఆయన అక్టోబర్ 1న విడుదలకానున్న తన తాజా భారీ చిత్రం పులి పై బోలెడు ఆశలు పెట్టుకొని ఉన్నాడు. ఈ చిత్రంలో శృతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తుండగా, అలనాటి అతిలోకసుందరి శ్రీదేవి కీలకపాత్రలో నటిస్తోంది. ఇక సుదీప్ ఈ చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. బాహుబలిలాగా ఈ చిత్రం విజువల్ వండర్‌గా రూపొందడం, సోషియో ఫాంటసీ కథ కావడంతో ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో స్థానం సంపాదించుకోవాలని విజయ్ భావిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలకు సంగీత సంచలనం దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుడటం మరో విశేషం. మరి అక్టోబర్1, 2 వ తేదీలో ఇద్దరు హీరోలు కీలకమైన అగ్నిపరీక్షను ఎదుర్కొంటుండటం ఆసక్తిని కలిగిస్తోంది.