మెగాస్టార్ చిరంజీవి నుండి నిఖిల్, సునీల్ వరకు అందరూ టాలీవుడ్ హీరోలు బిజీగా ఉన్నారు. ప్రతి ఒక్కరు తమ తమ ప్రాజెక్ట్స్‌తో ముందుకు వెళుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి బ్రూస్‌లీ చిత్రంలో గెస్ట్‌రోల్‌లో, బాలయ్య డిక్టేటర్‌తో, నాగార్జున సోగ్గాడే చిన్నినాయన, ఊపిరి చిత్రాలతో, పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్‌సింగ్, ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో, మహేష్‌బాబు బ్రహ్మూెత్సవంతో, బన్నీ సరైనోడు, ప్రభాస్ బాహుబలి2. రామ్‌చరణ్ బ్రూస్‌లీ; రవితేజ బెంగాల్‌టైగర్, రామ్ శివమ్, సునీల్ కృష్ణాష్టమితో పాటు వంశీ ఆకెళ్ల చిత్రం, నిఖిల్ శంకరాభరణం, నారా రోహిత్, సాయిధరమ్‌తేజ్, వరుణ్‌తేజ్, నాగచైతన్య సాహసం శ్వాసగా సాగిపో; ప్రేమమ్ రీమేక్, అఖిల్ అఖిల్ సినిమాతో, గోపీచంద్, మంచు మనోజ్, మంచు విష్ణు.. ఇలా అందరూ బిజీ బిజీగా ఉన్నారు. రాబోయే అక్టోబర్ నెల నుండి వచ్చే ఏడాది సమ్మర్ వరకు ఇక చిత్రాలే చిత్రాలు. ఇక ఈ ఆనందాన్ని జుర్రుకోవడం సినీ ప్రియుల వంతే...!