పాతనీరు స్థానంలో కొత్త నీరు వచ్చి చేరడం సహజం. ఇప్పుడు టాలీవుడ్‌లో కూడా యువ దర్శకులు తమ సత్తా చాటుతున్నారు. దాసరి, విశ్వనాథ్, బి.గోపాల్, రవిరాజా పినిశెట్టి, రేలంగి నరసింహారావు, కోడిరామకృష్ణ, కోదండరామిరెడ్డి.. ఇలా సీనియర్ల కథలు కంచి చేరడంతో ఆస్దానాలను భర్తీ చేసే సామర్ధ్యం తమకు ఉందంటూ కొందరు యంగ్‌టాలెంటెడ్ దర్శకులు భరోసా ఇస్తున్నారు. కేవలం మిర్చి, శ్రీమంతుడు చిత్రాలతో అదరగొట్టే హిట్స్ ఇచ్చిన కొరటాల శివ, చిన్న సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్‌గగా మారిన మారుతి, విభిన్న కథాచిత్రాలకు శ్రీకారం చుడుతోన్న క్రిష్, చందు మొండేటి, కొండా విజయ్‌కుమార్, విక్రమ్ కె. కుమార్, సుజీత్, బాబి. సంపత్ నంది, శ్రీకాంత్ అడ్డాల, శ్రీవాస్, సుధీర్‌వర్మ, హరీష్‌శంకర్, దేవకట్టా... ఇలా ఈ లిస్ట్ చాలా పెద్దదే ఉంది. మరి ఈ డైరెక్టర్లు కొద్దిరోజులకే కనుమరుగు కాకుండా తమ కెరీర్స్‌ను సుస్థిరం చేసుకొని వరుస విజయాలు సాధిస్తూ, దర్శకులుగా మంచి పేరు సంపాదిస్తే మాత్రం ఇక టాలీవుడ్‌కు దర్శకుల కొరత ఉండదని, సీనియర్ల స్ధానాన్ని ఈ యువ దర్శకులు భర్తీ చేస్తే రాబోయే రోజులన్నీ ఇక వీరివే అని ఖచ్చితంగా చెప్పవచ్చు.