Advertisement
Google Ads BL

బ్రహ్మోత్సవం కు స్పెషల్‌ అట్రాక్షన్‌..!


శ్రీమంతుడు వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత మహేష్‌బాబు శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రాన్ని మొదట్లో వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని పివిపి సంస్థ భావించింది. కానీ అది జరిగే పని కాదని ఆలస్యంగా అర్థం చేసుకున్న టీమ్‌ ఈ చిత్రాన్ని ఏప్రిల్‌7, 2016న విడుదల చేయాలని నిర్ణయించిందట. కాగా ఈ చిత్రంలో రసవత్తర విషయాం ఏమిటంటే ఏకంగా మహేష్‌ సరసన ముగ్గురు ముద్దుగుమ్మలు నటిస్తున్నారు. సమంత, కాజల్‌, ప్రణీతలు మహేష్‌తో ఆడిపాడనున్నారు. అయితే ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ తోడయిందని సమాచారం. యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిలిమ్స్‌ చూసే వారికి చాందిని చౌదరి చిరపరిచితమే. తాజాగా ఆమె కేటుగాడు చిత్రంలో హీరోయిన్‌గా నటించింది. కాగా చాందిని చౌదరికి మహేష్‌ బ్రహ్మోత్సవంలో ఓ మంచి ఆఫర్‌ ఇచ్చాడట. ఈ చిత్రంలోని ఓ పాటలో మహేష్‌తో కలిసి చాందిని స్టెప్పులు వేసిందని సమాచారం. ఇటీవలే ఈ పాట షూటింగ్‌ కూడా పూర్తయిందని తెలుస్తోంది. మహేష్‌తో కలిసి నటించడం వల్ల తనకు మున్ముందు మరిన్ని మంచి ఆఫర్స్‌ వస్తాయని చాందిని భావిస్తోంది...! 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs