Advertisement
Google Ads BL

విశ్వరూపం2 విషయంలో ఫైనల్‌ డెసిషన్‌..!


లోకనాయకుడు కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వలో హీరోగా నటించిన విశ్వరూపం చిత్రం అన్ని భాషల ప్రేక్షకులను అలరించడంతో పాటు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టింది. కానీ ఈ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన విశ్వరూపం2 చిత్రం పూర్తయి ఎంతో కాలం అయినప్పటికీ ఈ చిత్రం ఇప్పటికీ విడుదల కాలేదు. కమల్‌ హీరోగా స్వీయదర్శకత్వంలో రూపొందిన ఈచిత్రాన్ని ఆస్కార్‌ ఫిలిమ్స్‌ బేనర్‌పై రవిచంద్రన్‌ నిర్మించాడు. అయితే ఇటీవల ఆయన తీసిన ఐ చిత్రం ఆర్థికంగా బాగా నష్టాన్ని తెచ్చిపెట్టడంతో ఆస్కార్‌ రవిచంద్రన్‌ కూడా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాడు. అయితే ఇటీవలే కమల్‌ రవిచంద్రన్‌తో కలిసి మాట్లాడి ఓ ఫైనల్‌ డెసిషన్‌ తీసుకున్నట్లు కోలీవుడ్‌ సమాచారం. అదేమిటంటే... ఇప్పటివరకు ఆ చిత్రానికి అయిన ఖర్చును కమల్‌ ఆస్కార్‌ రవిచంద్రన్‌కు చెల్లించి తానే కొనుగోలు చేసి తమ సొంత బేనర్‌ అయిన రాజ్‌కమల్‌ ఫిలిమ్స్‌ బేనర్‌పై చిత్రాన్ని విడుదల చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడని, అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే రాబోయే సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కావడం ఖాయమని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 

Advertisement
CJ Advs
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs