చాలాకాలం తర్వాత ఓకే కన్మణి (తెలుగులో ఓకే బంగారం)తో క్రియేటివ్ జీనియస్ మణిరత్నం మరలా ట్రాక్‌లోకి వచ్చి సక్సెస్ రుచి చూశాడు. కాగా ఇప్పుడాయన ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు, కార్తి, దుల్కర్‌సల్మాన్‌లు ఈ చిత్రంలో హీరోలుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రంలో దుల్కర్‌సల్మాన్‌కు జోడీగా పలువురు హీరోయిన్లను పరిశీలించిన మణికి ఎవ్వరూ నచ్చకపోవడంతో ఓకే బంగారంలో దుల్కర్ సల్మాన్‌కు జోడీగా నటించి ఆన్‌ది స్క్రీన్ అద్బుతమైన కెమిస్ట్రీ పండించిన నిత్యామీనన్ వైపే మొగ్గుచూపాడట. ఈ పాత్ర చేయడానికి నిత్యా కూడా ఆనందంగా ఒప్పుకోవడంతో మరలా ఈజోడీ మరోసారి వెండితెరపై కనిపించనుంది. ఇక కార్తీకి జోడీగా త్రిషను పెట్టుకుంటే బాగుంటుందని భావిస్తున్నాడట మణిరత్నం. మరో వారం లోపు ఈ విషయంపై కూడా క్లారిటీ రానుంది. కాగా ఈ చిత్రానికి కోమలి అనే టైటిల్‌ను పెట్టే యోచనలో మణి ఉన్నాడని సమాచారం.